Baghpat Platform Collapse: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు.