బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సోషల్ మీడియాతో ప్రతి ఇంటికి మన సందేశం వెళ్ళాలి.. దేశ ప్రజలు మూడోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలు.. ఎవరి దగ్గరికి వెళ్లినా మోడీ మోడీ అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కానీ మోడీ…