దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదం మరువక ముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వేశాఖ తెలిపింది.