దళపతి విజయ్… డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్టర్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా విజయ్ లోకేష్ కలిసి సినిమా చేస్తున్నారు అంటేనే లియో సినిమాపై ఇద్దరికీ ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మాస్టర్ సినిమా సమయంలో లోకేష్ కి ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది ఇప్పుడు…
కార్తితో కలిసి ఖైదీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు లోకేష్ కనగరాజ్. ఇదే జోష్‌లో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా చేశాడు కానీ ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మెప్పించలేకపోయింది. అందుకే.. ఆ లోటును తీర్చడానికి ఇప్పుడు ‘లియో’ సినిమాతో రాబోతున్నాడు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ వంటి సాలిడ్ హిట్ కొట్టిన లోకేష్… విజయ్‌తో అంతకుమించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 19న…