Lok Sabha Elections 2024: బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకుంటాని చెబుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి.
బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
JP Nadda: ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి ‘వంశపారంపర్య పార్టీల’ కూటమిగా అభివర్ణించారు. ఈ కూటమిలోని సగం మంది నాయకులు జైల్లో ఉంటే, మరో సగం మంది బెయిల్‌పై ఉన్నారని అన్నారు.
Summer Heatwave: ఈ ఏడాది వేసవి మరింత హాట్‌గా ఉండబోతున్నట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. కోయంబత్తూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు భారీ రోడ్ షో నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.
కడియం శ్రీహరి ఎమ్మార్పీఎస్ మీద, తమ మీద వ్యక్తిగత విమర్శలు చేశారని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. తన స్వార్థాన్ని, తన అవకాశవాదాన్ని కప్పి పుచ్చుకోవడానికి మా మీద నిందరోపణ చేసే ప్రయత్నం చేశాడన్నారు. తన బిడ్డ భవిష్యత్ కోసమే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
మంత్రి అతిషికి డిఫమేషన్ నోటీసు పంపామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ చెప్పారు. తనను ఎవరు ఆశ్రయించారు.. ఎప్పుడు ఆ ఘటన జరిగింది.. దానికి సంబంధించిన సాక్ష్యాలను అతిషి ఇవ్వలేకపోయినట్లు ఆయన ఆరోపణలు చేశారు.