Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. యుపిలోని హాట్ సీట్లలో ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలో పోటీ ఉత్కంఠగా మారింది. ఈసారి వాయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ ఈరోజు తొలిసారిగా ప్రచారం నిర్వహించనున్నారు.
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని సవరించిన తర్వాత ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కార్యాలయం ఆమోదించింది. పాటను రచించి, వాయిస్ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే పాట ఆమోదం పొందినట్లు ధృవీకరించారు.