Defence Deal: భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆమోదించింది. ఇరు దేశాల మధ్య భారీ డిఫెన్స్ డీల్ ఓకే అయింది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా భారత్‌కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్‌ను అందించేందుకు మార్గం సుగమమైంది.
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్‌కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
US Stock Market: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం రోజురోజుకు తీవ్ర తరం అవుతోంది. యుద్ధం కారణంగా ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ లోనూ క్షీణతతో ట్రేడింగ్ ప్రారంభమైంది.