ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందులు తదితర విషయాల గురించి ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ఈనెల 13 వ తేదీన రంజాన్ కావడంతో రంజాన్ తరువాత నుంచి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే…
కర్ణాటకలో ప్రస్తుతం లాక్‌డౌన్ కోనసాగుతోంది. ఈరోజు నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని దేవసుగుర్ చెక్‌పోస్ట్ దగ్గర కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యం,నిత్యవసర సరుకుల వాహనాలను మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కర్ణాటకలో రోజువారి కరోనా కేసులు 40 వేలకు పైగా నమోదవుతుండటంతో రెండు వారాలపాటు సంపూర్ణలాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్…
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అను అమలు చేస్తున్నారు. ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను విధించారు. దీంతో షాపులు, రెస్టారెంట్లు అన్ని మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారబోతున్నాయి. అయితే, వీధుల్లో తిరిగే జంతువులకు ఆహరం దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన ఒడిశా ముఖ్యమంత్రి వీధి జంతువుల…
దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం “లాక్ డౌన్” పొడిగించారు సిఎం కేజ్రీవాల్. ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుందన్నారు. ఇక నుంచి కఠినమైన “లాక్ డౌన్” నిబంధనలు అమలు చేస్తామని… మే 10 వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు రద్దు కానున్నాయని సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. “మెడికల్ ఆక్సిజన్” అందుబాటు పరిస్థితి నిలకడగా ఉందని… దేశ రాజధానిలో కొత్తగా 17,364 “కోవిడ్” కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. 24…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే, ఆదివారం కావడంతో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి కనిపించడం లేదు. దీంతో ఆదివారం రోజున ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కొంతమేర ఫలితం కనిపిస్తుందని శ్రీకాకుళం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఈరోజు సంపూర్ణ లాక్…
ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది…
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాల్లో కూడా వణికిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యలో కరోనా రోగులు కనిపిస్తున్నారు. అయితే, గుజరాత్ లోని మోహ్సహా జిల్లాలోని బేచరాజీ మండలంలో చాందిని అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా హైదరాబాద్ నగరంతో పాటుగా జిల్లాల్లోని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని భుత్పూర్ మున్సిపాలిటీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో అక్కడి మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు…
నేటి నుండి 10 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల నుండి యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనారసింహ స్వామి కొలువైఉన్న యాదగిరిగుట్టలో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. నేటి నుంచి పది రోజులపాటు అమల్లో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రతి…
దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక హర్యానా లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటకు వచ్చిన వారికి వెరైటీగా పోలీసులు శిక్ష విధిస్తున్నారు. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన కొందరిని గుంజిళ్ళు తీయిస్తూ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో…