కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలసకూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లిపోయారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్‌డౌన్ విధించడంతో అన్ని రంగాలు ఒక్కసారిగా మూతపడ్డాయి. 2020 మార్చి నుంచి జూన్ 2020 వరకు సుమారు 23 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగాలతో పాటు లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయారు. మ్యానుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్టింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్, హాస్పిటాలిటీ, బీపీవో వంటి…