‘మా’ ఎన్నికల్లో ఈసారి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ అయితేనే మంచి చేస్తాడని నమ్ముతున్నానంటూ చెప్పిన బండ్ల గణేష్.. అనూహ్యంగా ప్రకాష్ ప్యానల్‌లోకి వచ్చిన జీవితా రాజశేఖర్ ను వ్యతిరేకిస్తూ బండ్ల బయటకు వచ్చారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘జీవితా అంటే నాకు వ్యక్తిగతంగా కోపం ఏమిలేదు.. ఆమె అంటే చాలా గౌరవం..…