Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని…
మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్ కాపీని మాచవరం ఎస్.బిఐ బ్యాంకు అధికారులకు అందజేసిన కోర్టు సిబ్బంది. రూ.11 కోట్ల నగదు విషయంలో కోర్టు ఆదేశాలను పాటించాలని బ్యాంకు అధికారులను కెసిరెడ్డి న్యాయవాదులు కోరారు. గత నెల 30వ తేదీన సిట్ రూ. 11 కోట్ల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజర్చిన విషయం తెలిసిందే. ఈ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.