Today Business Headlines 27-03-23: టీసీఎస్ రాజన్నకు అవార్డు: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ రీజనల్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రాజన్నకు సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. ఆ సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధికి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని అసోసియేషన్ పేర్కొంది.
నిర్మాణ రంగంలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు అందుకున్న మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయనకు గురువారం నాడు తెలంగాణ క్రెడాయ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా జూపల్లి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ… హైదరాబాద్ నగర ప్రగతిలో కన్‌స్ట్రక్షన్…