RG Kar Case : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసు విచారణ సోమవారం (జనవరి 20) కోల్‌కతాలోని సీల్దా కోర్టులో జరిగింది.
Mukhtar Ansari: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవతఖైదు విధించింది. 1990లో నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా ఆయుధ లైసెన్స్ పొందిన కేసులో బుధవారం అన్సారీకి జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 428 (అపరాధం), 467 (విలువైన భద్రతను ఫోర్జరీ చేయడం), 468 (మోసం కోసం ఫోర్జరీ), 120బి (నేరపూరిత కుట్ర) మరియు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30…
Soumya Vishwanathan: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఇటీవల నిందితులకు కోర్టు జీవితఖైదు విధించింది. తన కూతురికి న్యాయం జరిగిందని సంతోషించేలోపలే, సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్ శనివారం కన్నుమూశారు. 82 ఏళ్ల ఎంకే విశ్వనాథన్ విచారణకు రెండు రోజుల ముందు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే, తన కూతురి హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు.
Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.
Supreme Court : ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భార్యభర్తలు సుప్రీంకోర్టును వెరైటీ కోరిక కోరారు. బిడ్డను కనాలని ఉందని అందుకు ఐవీఎఫ్ చేయించుకునేందుకు పెరోల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.