కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మరణించడంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన భౌతికంగా అభిమానుల మధ్య లేకపోయినా సినిమాల రూపంలో కళ్ల ముందు మెదులుతున్నారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులను ప్రజలు తమ హృదయాల్లో దాచుకున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పునీత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో ప్రధానంగా విధి గురించి పునీత్…