India: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ప్రధాని నేరుగా భారత్ పై విమర్శలు గుప్పించడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇక భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
Bharat- Canada Dispute: భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య…