Legionnaire's disease in Argentine: ప్రపంచాన్ని కొత్తకొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి లాటిన్ అమెరికా దేశం అయిన అర్జెంటీనాలో ప్రబలుతోంది. లిజియోనెల్లా బ్యాక్టీరియా ద్వారా వచ్చే లెజియోనైర్స్ వ్యాధి బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన 11 మంది పడగా.. నలుగురు మరణించారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు ఉత్తరాన 670 మైళ్ల దూరంలో ఉన్న శాన్ మిగ్యుల్ డి టుకుమాన్ నగరంలో ఈ వ్యాధి వ్యాపించింది.