(జూన్ 6న డి.రామానాయుడు జయంతి)“పుట్టినరోజు పండగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ…” అనే పల్లవితో సాగే పాట ‘జీవనతరంగాలు’ చిత్రం కోసం డాక్టర్ సి.నారాయణ రెడ్డి కలం నుండి జాలువారి ఎందరినో అలరించింది. ఆ పాట రాయించుకున్న ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడుకు ఆ గీతం అన్ని విధాలా సరిపోలుతుంది. “తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి… తానున్నా లేకున్నా… తన పేరు నిలవాలి…” అంటూ అదే పాటలో తరువాతి పంక్తులు…