Leech Found In Nose: మామూలుగా "జలగ" అంటే చాలా మంది భయపడుతుంటారు. నీటిలో చాలా సేపు గడిపినప్పుడు శరీర భాగాలను అంటిపెట్టుకుని రక్తాన్ని తాగుతుంటుంది. చాలా సందర్భాల్లో మనకు జలగ కుడుతున్న విషయం కూడా తెలియదు. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ముక్కులో జలగ కొన్ని రోజులుగా ఉంటున్న అరుదైన కేసు నమోదైంది.