టాలీవుడ్‌లో సరికొత్త ప్రతిభను వెలికితీస్తూ, నటీనటులకు శిక్షణ ఇవ్వడంలో తనదైన ముద్ర వేసుకున్న ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. కేవలం నటన నేర్పించడమే కాకుండా, తన విద్యార్థులను వెండితెరపైకి పరిచయం చేసే లక్ష్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇదే వేదికపై ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌పై…
తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన గొప్ప రచయిత, ఆచార్యుడు, తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కీ. శే. విశ్వనాథ సత్యనారాయణ. వారి జీవిత చరిత్ర వెండితెరపై 'కవిసమ్రాట్' పేరుతో ఆవిష్కృతమైంది.
తెలుగు సాహితీ క్షేత్రాన్ని తన రచనలతో సుసంపన్నం చేశారు కవిస్రమాట్ విశ్వనాథ సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరిస్తే, సాహితీ రంగం ఆయనను జ్ఞానపీఠంపై కూర్చోపెట్టింది. 1895లో జన్మించి, 1976లో కన్నుమూసిన విశ్వనాథ సత్యనారాయణను ఈ తరం సాహితీ కారులూ నిత్య స్మరిస్తుంటారంటే ఆయన రచనల ప్రభావం ఎలాంటిదో అర్థమైపోతుంది. తెలుగు సాహితీ రంగంలో విశ్వనాధ స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కవిసమ్రాట్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ప్రముఖ నటుడు,…