నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నందిగామలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా విధుల బహిష్కరణకు నందిగామ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు వర్గాల న్యాయవాదుల మధ్య ఏదో సమస్యపై వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత వారు గాలిలోకి కాల్పులు జరిపారని కనుగొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జూనియర్ న్యాయవాదులకు శుభవార్త చెప్పారు.. నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్ధిక సహాయం అందించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది..
మయన్మార్ లో రాజకీయ ఖైదీల కేసులను తీసుకోకుండా న్యాయవాదులపై అడ్డంకులు, ఆంక్షలు విధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. "మయన్మార్ లో ఇప్పటికే బలహీనమైన న్యాయ వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. న్యాయ హక్కులను సమర్థించడంలో విఫలమైందని 39 పేజీల నివేదికను విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని దేశాల్లో రాజవంశీయులు ఉన్నారు. సాధారణంగా రాజవంశీయులు బయటకు రారు. ఏదైనా పెద్ద వేడుక జరిగే సమయంలో.. అది అందులో రాజవంశీయులు తప్పకుండా పాల్గొనాల్సి ఉందంటేనే బయటకు వస్తారు. కానీ 130 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బ్రిటన్ రాజవంశానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరుకానున్నారు.
YSR Law Nestham: రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకుంటున్నవారికి వైఎస్సార్ లా నేస్తం కింద ఆర్థిక సాయం అందజేస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ది చేకూరనుంది.. అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో బుధవారం రోజు అంటే ఈ నెల 22వ తేదీన రూ. 1,00,55,000 ను వర్చువల్…
ద్వీప దేశం శ్రీలంకలో మళ్లీ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఎంతటివారికైనా కొన్నిసార్లు నిరసన తప్పదు.. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పి. చిదంబరానికి నిరసన సెగ తాకింది… ఓ కేసులో వాదించేందుకు హైకోర్టుకు న్యాయవాదిగా వెళ్లారు చిదంబరం.. అయితే, ఆయన్ను కాంగ్రెస్ మద్దతుదారులైన న్యాయవాదులు అడ్డుకున్నారు… పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు చిదంబరం కారణమంటూ మండిపడ్డారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.. Read Also: Koratala shiva :…
న్యాయస్థానాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమకు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నారని.. ఇది దురదృష్టకర పరిణామం అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరించేవి అని ఆయన గుర్తుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఆమన్‌కుమార్‌పై నమోదైన కేసును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసింది.…