YSR Law Nestham: రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకుంటున్నవారికి వైఎస్సార్ లా నేస్తం కింద ఆర్థిక సాయం అందజేస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ది చేకూరనుంది.. అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో బుధవారం రోజు అంటే ఈ నెల 22వ తేదీన రూ. 1,00,55,000 ను వర్చువల్ గా జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది జగన్ సర్కార్.. మూడున్నరేళ్లలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద.. మొత్తంగా రూ. 35.40 కోట్లు ఆర్ధిక సాయం చేసింది ప్రభుత్వం..
Read Also: Off The Record: కంటోన్మెంట్ సీటుపై నేతల ఆశలు..! పోటీకి ఆ ముగ్గురు తహతహ..!
కాగా, లాయర్లకు స్టైఫండ్ ఇచ్చే పథకానికి వైఎస్సార్ లా నేస్తంగా పేరు పెట్టిన విషయం విదితమే.. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన ఈ పథకాన్ని శ్రీకారం చుట్టూరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు.. దాదాపు మూడేళ్ల పాటు.. నెలకు రూ.5000 ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తూ వస్తున్నారు.. అర్హులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. లా డిగ్రీతో పాటు జనన ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.. సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి. దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంక్ అకౌంట్ వివరాలను పొందుపర్చాలి.. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం ఉన్న సీనియర్ లాయర్లు, బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి.