బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన ఛత్తీస్‌గఢ్ న్యాయవాదిని ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫైజాన్ ఖాన్‌ను రాయ్‌పూర్ నివాసం నుండి అరెస్టు చేశారు. బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నవంబర్ 14న ముంబై వస్తానని ఫైజాన్ ఖాన్ గతంలో చెప్పాడు.