Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్‌లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం…