ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం పెరగనుంది. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఆశావర్కర్లు ఇకపై నెలకు రూ.7,500 జీతం బదులుగా రూ.9,750 అందుకోనున్నారు.…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడు నరసింహంపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలపై సోము వీర్రాజు స్వయంగా స్పందించారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని… వీరిలో పెద్దమ్మాయికి తాను పెళ్లిచేయలేదని వివరణ ఇచ్చారు. తనకు ఇద్దరే అల్లుళ్లు ఉన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తన పెద్దమ్మాయి తానే పెళ్లిచేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని… కాబట్టి అతడిని తన అల్లుడిగా ఎప్పటికీ…
కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టాబ్లెట్‌తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మాత్ర వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్‌తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ..…
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉట్నూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. లక్కారం పరిధిలోని కేబీనగర్‌లో ఈ దారుణం జరిగింది. మహిళపై యాసిడ్ పోసి దుండగులు పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మహిళపై యాసిడ్ దాడి ఎందుకు…
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. బుధవారంతో పోలిస్తే దాదాపు కేసుల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో నిన్న 325 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,82,876కి చేరింది. అటు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,206 మంది…
టీమిండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరబోతున్నాడు. టెస్టు కెరీర్‌లో అతడు వందో టెస్టును ఆడనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్ట్ ఆడితే 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ… సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో 100వ టెస్టు మజిలీకి చేరుకోనున్నాడు. ఆ టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సుదీర్ఘ కాలంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సేవలు అందిస్తున్న కోహ్లీ… తన వందో టెస్టును బెంగళూరులో…
గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం వేకువజామున పెను విషాదం చోటు చేసుకుంది. సాచిన్ ప్రాంతంలోని ఓ ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న ట్యాంకర్ పైపు నుంచి గ్యాస్ లీక్ కాగా క్షణాల్లోనే ఆ వాయువును పీల్చిన విశ్వప్రేమ్ మిల్లులోని…
ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది…
దేశంలో ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండటంతో ఆయా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా… బుధవారం…
దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు లభించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ గొట్టం కాజాను నేటి తరం గుర్తించేందుకు ప్రత్యేక పోస్టల్ కవర్‌ను తపాల శాఖ విడుదల చేసింది. 1891లో తొలిసారిగా కాకినాడ కాజాను తయారుచేశారు. కోటయ్య అనే వ్యక్తి తొలిసారిగా ఈ కాజాను తయారు చేసి కీర్తిని పొందారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది.…