సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది మాత్రం నిజం. ఓ జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో కసబిసా నమిలి మింగేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. పాపం గడ్డి అనుకుని పామును అలా నమిలేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడికే చనిపోగా, 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.. తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. పుత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు..…
దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లనే తాగాల్సి రావొచ్చు. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా టీ- బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మృతురాలిని శిరీషగా గుర్తించారు. శిరీష రెండ్రోజులుగా కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని నీటి కుంటలో పడేశారు. అయితే శిరీష హత్యపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అంతేకాకుండా శిరీషను చంపి కళ్లను స్క్రూ డ్రైవర్…