చిత్తూరు జిల్లా తిరుపతిలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడికే చనిపోగా, 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.. తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. పుత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు..
పోలీసుల వివరాల మేరకు..తిరుపతిలోని ఎస్‌ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించేందుకు ఆదివారం బయలుదేరారు.. వారి కార్యాలయంలో పనిచేసే 12 మంది సిబ్బంది టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. టెంపో టోల్‌ప్లాజా దాటి అంజేరమ్మ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న హెరిటేజ్ పాల ట్యాంకర్ ను ఢీ కొట్టింది.. ఈ ప్రమాదం సమయంలో టెంపోలో 12 మందితోపాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి…
టోల్ ప్లాజా అంబులెన్స్ లో క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.. ఇక మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ కూడా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.. క్షతగాత్రుల్లో నెల్లూరు కు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లెకి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామి రెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేటకు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. తాజాగా మరో ప్రమాదం జరిగింది.. రెండు టెంపో ట్రావెలర్ వాహనాలకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఐదుగురికి గాయాలయ్యాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..