తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. జాతరలో ముఖ్య ఘట్టమైన పగిడిద్దరాజు, గోవిందరాజులు నేడు గద్దెలపైకి రానున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకురానున్నారు. అయితే.. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది…
ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్న సీఎం…
తెలంగాణలో నేడు రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగనున్నాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో రోడ్ షోల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. నారాయణపేట పట్టణం శాసన్ పల్లి రోడ్, లక్ష్మీ ఫంక్షన్ హల్ లో ఉదయం 9గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ధన్వాడలో రోడ్ షో, స్థానిక మహిళలతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. దేవరకద్ర, లాల్…
ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది.
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్…
తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఏడాది జరగబోయే పరీక్షల నోటిఫికేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ 21 ఫిబ్రవరి 2024 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26 నుంచి ఆన్ లైన్ లో…
టాలీవుడ్ దర్శకుడు VI ఆనంద్ తెరకేక్కించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన.. యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం ఈ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని ప్రకటించారు. OPBK సమర్పణలో AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకరతో కలిసి…
హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ట్రెండ్ ను ఫాలో అవుతారు.. ట్రెండింగ్ లో ఉన్నవాటిని ఆధారంగా చేసుకొని వాహనదారులకు సూచనలు ఇవ్వడంతో పాటుగా చలాన్ లు కూడా విధిస్తారు .. గతంలో పుష్ప డైలాగ్స్ తో ట్రెండ్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. కుమారి ఆంటీ.. ఆమె చెప్పిన రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే డైలాగ్ ను అందరూ…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించేందుకు.. అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ వచ్చాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు.. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్, భయాందోళనకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో హిట్ సినిమాలు పెద్దగా లేవని తెలిసిందే.. సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. వరస పెట్టి ప్రయోగాలు లాంటి సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టు లతో చేస్తున్నా కలిసి రావటం లేదు.. అయినా సందీప్ అదే ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సూపర్…