తెలుగులో సూపర్ హిట్ ను అందుకున్న సినిమా ‘హిట్ ‘.. సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్వర్స్’ అని ఒక యూనివర్స్ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే గుసగుసలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..
శైలెష్ కొలనుకు నాని అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. దాంతోనే ‘హిట్ 3’లో నానిని లీడ్గా తీసుకొని తన హిట్వర్స్ను ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్నాడు ఈ దర్శకుడు. కానీ అంతలోనే నానికి, శైలేష్కు మధ్య క్రియేటివ్ పరంగా మనస్పర్థలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం కూడా ఉంది.. ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా తాను నెక్స్ట్ చేయబోతున్న సినిమాల గురించి అప్డేట్స్ ఇచ్చాడు.. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ, సుజీత్, వేణు లాంటి దర్శకులను లైన్లో పెట్టాడు. ఇందులో శైలేష్ కొలను పేరు లేకపోవడంతోఈరోజు వార్తలు ఊపందుకున్నాయి..
ప్రస్తుతం నానికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ‘హిట్ 3’ లేట్ అవుతుందని భావించిన శైలేష్ కొలను.. వెంకటేశ్తో ‘సైంధవ్’ తెరకెక్కించాడు. అయితే,ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఈ కారణం వల్ల కూడా నాని.. తనతో వర్క్ చేయడానికి ఆలోచిస్తున్నాడేమో అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఆ తర్వాత బలగం వేణు దర్శకత్వం లో సినిమా చేయబోతున్నాడు.. మరి హిట్ 3 సినిమాను ఎప్పుడూ సెట్స్ మీదకు తీసుకెళ్తాడో తెలియాల్సి ఉంది..