కాన్పూర్‌లోని టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకువచ్చిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 15 మంది పాదచారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. టాట్ మిల్ ఇంక్లైన్‌లో బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడంతో కార్లు, బైకులు, పాదచారులను ఢీకొట్టాయని కాన్పూర్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రమోద్ కుమార్ తెలిపారు. 9 మంది…
వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా అడవుల్లో మంటలు చెలరేగడం సర్వసాధారణం. అయితే ఈ మంటలు తీవ్రమైన నష్టాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) తన పరిమితుల్లో అడవి మంటలను నిరోధించడానికి, నియంత్రించడానికి ఈ సంవత్సరం స్థానిక చెంచులలో రోపింగ్, వారి సేవలను ఉపయోగించుకోనుంది.ముందుగా ఫైర్ లైన్ల నిర్వహణ, ఇతర అంశాలపై స్థానిక చెంచులకు అవగాహన కల్పిస్తున్నారు. దీని కోసం, ATR రిజర్వ్ ఫారెస్ట్‌లోని సంబంధిత పెంటాస్ (గ్రామాలు)లో పని చేయడానికి సీజన్‌లో చెంచులను తాత్కాలికంగా నియమిస్తోంది. సాధారణంగా,…
హైదరాబాద్ కు చెందిన మహేష్ కో ఆపరేట్ బ్యాంకు పై ఇటీవల సైబర్ నేరగాళ్లు దాడి చేసి.. రూ. 12 కోట్లకు పైగా డబ్బును 129 అకౌంట్లలోకి బదిలీ చేశారు. దీంతో మహేష్ బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేష్ బ్యాంక్ సర్వర్ పై…
డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు రావచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు టోనీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు. టోనికి హైదరాబాదులోని…
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా కల్చరల్ అంబాసిడర్ అఫ్ తెలంగాణగా ఎదిగిన భరత్ భూషణ్ వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్ లో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్…
మునుపెన్నడూ లేని విధంగా రోడ్డు మౌలిక సదుపాయాలను రూపాంతరం చేస్తూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు డ్రైవింగ్ పరిస్థితులను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్ట్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (SRDP) మరో అభివృద్ధి చేసిన రోడ్డును అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎస్ఆర్డీపీ కింద వివిధ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), ఇప్పుడు LB నగర్ వద్ద అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌లలో ఒకటైన అండర్‌పాస్‌ను సిద్ధం…
సోమవారం రాత్రి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మేస్రం కులస్తుల ధార్మిక, సాంస్కృతిక సంబంధమైన వార్షిక నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మేస్రం పెద్దలు మరియు పూజారుల ప్రకారం, ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాత్రి 10 గంటలకు వంశంలోని సభ్యులు మహాపూజతో ప్రారంభించనున్నారు. పాదయాత్రగా వెళ్ళితెచ్చిన పవిత్ర గంగాజలం తో నాగోబాను మేస్రం వంశీయులు అభిషేకించనున్నారు. మహాపూజతో ఈ జాతర వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ జాతర…
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా..…
ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటే విని ఉంటాం.. ప్రేమ మైకంలో తప్పని తెలిసినా కొందరు చెడు దారులు తొక్కుతూ.. వారి అందమైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వారిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరాన శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటును చేసుకుంది. మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే డ్రగ్స్ కు ప్రియుడు అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి డ్రగ్స్…
పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూకబ్జా, రెవెన్యూ ఉద్యోగులపై దౌర్జన్యం కేసులో పరారీలో ఉన్న వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 3 రోజులుగా దొడ్డి కిరణ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దొడ్డి…