మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోవడం ఎంత ముఖ్యమో, సమయానికి నిద్ర లేవడం కూడా అంతే ముఖ్యం. అయితే.. రాత్రి 10 గంటలకే నిద్రపోవాలని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. జీవక్రియ ఆరోగ్యంగా ఉండటానికి.. అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇది చాలా ముఖ్యం. వైద్యులు తొందరగా పడుకోవాలని సూచిస్తున్నా.. కొందరైతే రాత్రి 12 తర్వాత నిద్రపోయే వారు ఉన్నారు. అయితే.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, సరిపడా నిద్రపోకపోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం.