పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 22న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.