Pakistan: లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడు అమీర్ హంజాకు అనుమానాస్పద స్థితిలో తీవ్రంగా గాయపడ్డాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కి అమీర్ హంజా అత్యంత సన్నిహితుడు. ఈ ఉగ్రసంస్థ 17 మంది సహ వ్యవస్థాపకుల్లో హంజా కూడా ఒకడు. లష్కరే ప్రధాన సిద్ధాంతకర్తగా హంజా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను ఆప్ఘనిస్తాన్‌లో అప్పటి సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తర్వాత హఫీజ్ సయీద్‌తో చేతులు కలిపాడు.