President Murmu: కర్ణాటక మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఆహ్లాదకరమైన సంభాషణకు వేదికగా మారింది. ‘‘మీకు కన్నడ తెలుసా.?’’ అని సీఎం, రాష్ట్రపతిని ప్రశ్నించారు. ఇందుకు ఆమె ‘‘తనకు భాష తెలియదని, అయితే నేర్చుకుంటానని మాత్రం హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
Uddhav Sena: బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు.
విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని ఆరోపించారు.