MLC Elections: వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు బిజెపి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్‌కు పట్టిన…
Minister Kishan Reddy: అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నదని తెలిపారు. ఈ దిశగా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి…
Elevated Corridor : ఎన్‌హెచ్ 44లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 62,152 చదరపు గజాల (12.84 ఎకరాలు)ను సేకరించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భూములను తిరుమలగిరి మండలం భోలక్‌పూర్, తోకట్ట, సీతారాంపురం, బోవెన్‌పల్లి గ్రామాల పరిధిలోని సేకరిస్తున్నారు. ఇంతలో, అధికారులకు తీవ్రమైన సవాళ్లను కలిగిస్తూ, ప్రాజెక్ట్ కోసం సేకరించాల్సిన భూమిలో మతపరమైన నిర్మాణాలు, స్మశాన వాటికలు, విద్యా సంస్థలు, నివాస అపార్ట్‌మెంట్లు…
Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ…
తాజాగా లగచర్ల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనలో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ నేత సురేష్‌కు అసలు భూమి లేదని వికారాబాద్ కలెక్టర్ తేల్చిచెప్పారు.
పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచగా... కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా…
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.