ప్రముఖ దేవాలయం శ్రీశైలంలో షాపుల కేటాయింపు ఉత్కంఠ రేపింది. దుకాణాదారులు దేవస్థానం అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చివరకు పోలీసుల పటిష్ట భధ్రత నడుమ సాగిన షాపుల లక్కీ డిప్ లో కేవలం 24 మంది మాత్రమే పాల్గొన్నారు. మొత్తం షాపుల వేలంలో దుకాణా దారులు పాల్గొనలేదు. శ్రీశైలం దేవస్దానం పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేవస్దానంలోని మార్కెట్ షాపు అసోసియేషన్ తరఫున దుకాణాదారులందరూ మెయిన్ బజార్ షాపులు మొత్తం మూసివేసి…