ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…
లఖింపూర్ ఘటనపై రైతులు మండిపడుతున్నారు. అటు, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లఖింపూర్‌లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, లఖింపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నది. సీబీఐ చేత విచారణ చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు…
ఉత్తర ప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. లఖీంపూర్ ఖేరీ లో నిరసనలు చేపడుతున్న రైతుల మీదకు కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రా కుమారుడు కారుతో యాక్సిడెంట్ చేశాడని, ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందారని, అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మృతి చెందారని ఆరోపణలు. దీంతో కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ వైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, లఖీంఫూర్ ఘటన…
యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఈరోజు ఉదయం నుంచి అన్ని రాష్ట్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ధ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. లఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి కుమారుడి కారు…