తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో భళా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి, అహో అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి, అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకే విజయశాంతికి ‘సరిలేరు ఎవ్వరూ’ అని జనం జేజేలు పలికారు. ఆ మధ్య విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు.…