ఈ మధ్యకాలంలో అంటే ప్యాండమిక్ తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గించేశారు అని ఆ మధ్య భలేగా టముకు సాగింది. అయితే వారికి నచ్చిన, వారిని మెప్పించిన చిత్రాలకు మాత్రం జనం భలేగా పరుగులు తీశారు. ఈ తీరును గమనిస్తే లాక్ డౌన్స్ తరువాత కొన్ని చిత్రాలనే ప్రేక్షకులు ఆదరించారని తెలుస్తోంది. చిత్రమేమంటే, తెలుగు సినిమాలో అంతకు ముందు కొన్ని ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్’ భలేగా మురిపించాయి. కానీ, కరోనా కల్లోలం తరువాత ఏ ఒక్క స్త్రీ…