తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదం పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తమ వాదనలను వివరించారు. అనంతరం వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల వేతనాల అంశంపై మేము అదనపు కమిషనర్ గంగాధర్‌ను కలిసాము. లేబర్ కమిషన్ ఒక పర్సెంటేజ్…