Kunamneni: పొత్తులు పొత్తులే… పోరాటాలు పోరాటాలే… ప్రజల కోసమే పోరాటమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు అన్నారు. ప్రధాని పర్యటన పలుచగా జరిగిందని, ప్రధాని హోదా రాష్ట్రానికి ఏమివ్వలేదన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కోరిన మా పార్టీ నేతలను మోడీ వస్తున్నాడని అన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందర్నీ రెండ్రోజులు అరెస్ట్ చేసి నిర్బంధించారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదు… మేము దశాబ్దాలుగా బయ్యారం ఉక్కు కావాలని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణను ప్రేమించేదేది… తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది కమ్యూనిస్టు లే.. అన్నారు. మోడీ కామన్ మ్యాన్ కాదు… ప్రధాని.. దేశ ప్రజల ప్రతినిధి… కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పేరుతో దేశ ప్రజల్ని మోడీ మరోసారి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేటలో ఇప్పటికే నడుస్తున్న కోచ్ ఓవర్ హాలింగ్ యూనిట్ ని తిరిగి ప్రారంభించారు.. కేవలం 500 కోట్లు ఇచ్చారు… వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా ఇచ్చినట్టు తప్పుడు ప్రకటనలు చేశారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది.. ఆ విషయం ఆపార్టీ పెద్దలకు అర్థమై.. ఇక్కడ నిధుల కేటాయింపు చేయడం లేదన్నారు. మేకపోతు గాంభీర్యం కోసం తెలంగాణలో తిరుగుతున్నారు.. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, పార్టీ ఫిరాయింపుల అన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని తేలిందని అన్నారు. మోడీ చరిష్మా అయిపోయింది.. అందుకే నన్ను చంపుతారు.. సమాధి కడతారు అని సెంటిమెంట్ రెచ్చగొట్టే యత్నాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ట్రిపుల్ తలక్, ఉమ్మడి పౌరస్మృతి, caa nrc లాంటివి తెర మీదికి తెచ్చి పబ్బం గడుపుకునే రోజులు నడవవని అన్నారు.
Read also: Snake In ATM: ఏటీఎంలో ఏసీకి ‘చిల్’ అవుతున్న ‘స్నేక్ రాజ్’
కాంగ్రెస్ ముక్త భారత్ ప్రతిపక్ష ముక్త పార్టీ అని అన్న మోడీ ముఖంలో ఓటమి కొట్టిచ్చినట్టు కనిపిస్తుందన్నారు. ఎన్నికల అనంతరం పొత్తులు అలవెన్స్ లు ఉంటాయి.. ఎన్నికల పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. మతతత్వ రాజకీయాలను నిలువరించేలా పొత్తులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను కమ్యూనిస్టుల చుట్టే తిప్పుతున్నారని అన్నారు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. కమ్యూనిస్టు లే ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారని అపద్దం చెబుతున్నారని తెలిపారు. మేము చాలాసార్లు సీఎంని కలిసాం… పొత్తులు ఉంటాయి లేదంటే సొంతంగానే పోటీ చేస్తాం… పోయేదేముంది.. అన్నారు. మా గౌరవానికి భంగం కలిగేలా ఉంటే ఒప్పుకొమన్నారు. మా పార్టీలో చర్చలు జరిగాయి… పోటీ చేస్తే సొంతంగా పోటీ లేదంటే… ఈ ధనస్వామ్య ఎన్నికల్లో పోటీ చేయద్దు అనే రీతిలో చర్చలు జరిగాయన్నారు. గాంధీ.. జేపీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారని అన్నారు. మేము మేముగానే ఉంటాం… ఒకరికి తలవంచము… మా గౌరవానికి భంగం కలిగితే ఊరుకోమని తెలిపారు. హుస్నాబాద్ కొత్తగూడెం సీట్ల విషయం ఎన్నికల సమయంలో తేలుతుందని అన్నారు. మేము మునుగోడు పొత్తు తర్వాత పోరాటం చేయడం లేదనేది తప్పు.. ఇళ్ల జాగలు.. డబుల్ బెడ్ రూమ్ ల కోసం పెద్దఎత్తున పోరాడుతున్నాం.. కేసులు నమోదు అయ్యాయని అన్నారు. పొత్తులు పొత్తులే… పోరాటాలు పోరాటాలే… ప్రజల కోసమే పోరాటం అన్నారు.
Manipur Violence: భారత్ నుంచి క్రైస్తవ మతాన్ని తుడిచిపెట్టలేదు.. కేరళ బిషప్ వ్యాఖ్యలు..