KumbhMela Special Trains: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా కోసం 06 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్లు బీదర్-దానాపూర్, చర్లపల్లి-దానాపూర్, దానాపూర్-చర్లపల్లి మధ్య నడవనున్నాయి. బీదర్-దానాపూర్-చర్లపల్లి మధ్య 02 రైళ్లు, చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మధ్య 04 సర్వీసులను ఏర్పాటు చేశారు.