KTR: హైదరాబాద్‌లో ఇటీవల శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరగడం, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ…