రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో నేటితో చర్చ ముగియనుంది. గత రెండు రోజుల్లో 24 అంశాలపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు మిగిలిన 13 అంశాలపై చర్చ జరగనుంది. నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్య పన్నులు, వైద్య ఆరోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, గృహ, వ్యవసాయం, సహకారం, పంచాయతీరాజ్, రవాణా శాఖ, గవర్నర్-మంత్రి మండలిపై చర్చించనున్నారు.