KTR:హైదరాబాద్, సికింద్రాబాద్ కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం.. ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో కనిపిస్తుందని విమర్శించారు. మొట్టమొదటి పని టీఎస్‌ను టీజీగా చేశారు.. దీనివల్ల ఏ పేదవాడికి న్యాయం జరిగిందో తెలియదు.. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారన్నారు.
Secunderabad: సికింద్రాబాద్ చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. సికింద్రాబాద్‌కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు మద్దతుగా ‘సికింద్రాబాద్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా, ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.