ఏనిమదేండ్లలో తెలంగాణ అద్భుత మైన ప్రగతి సాధించిందని పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పేర్నొ్నారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. ఇక 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేది కానీ ఇప్పుడు 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పీఎం మోడీతో జరిగిన సమావేశంలో…
ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. పేదల సంక్షేమ పథకాలపై మోడీకి ఎందుకింత అక్కసు అంటూ పేర్కొన్నారు. అసలు మోడీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు.