ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు.