Off The Record: అనకాపల్లి జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అగ్నిపర్వతంలా మారుతోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో ఫుల్ జోష్‌గా కనిపించిన శాసనసభ్యుల్లో మెల్లిగా నిర్లిప్తత పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. జిల్లాలో తమ మాట చెల్లక…ఆవేదన చెప్పుకునే మార్గం కనిపించక, సీనియర్ ఎమ్మెల్యేలంతా మౌనమే బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నారట. ఒకప్పుడు జిల్లా అంతటా ఏం జరుగుతోందో ఆరా తీసి పెద్దలుగా పార్టీల పటిష్టానికి తమ సలహాలు ఇచ్చినవాళ్ళు కూడా ఇప్పుడు గిరి గీసుకుని నియోజకవర్గ హద్దు…