Krishnamachari Srikkanth on RCB Bowlers: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ప్రతి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చారు. ఎంతలా అంటే ఆర్‌సీబీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు 287 రన్స్ చేశారు. దాంతో ఆర్‌సీబీ బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్‌సీబీ బౌలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి…