Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కృష్ణా నదీ జలాల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనాన్ని తీవ్రంగా విమర్శించారు. గత రెండు నెలలుగా తమ పార్టీ చెబుతోన్న వాదనల్ని ఇప్పుడు కృష్ణా బోర్డు కూడా సమర్థించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అక్రమంగా 65 టీఎంసీల నీటిని తీసుకెళ్లిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లను అక్రమంగా తరలిస్తుందన్న విషయం మేము…
Uttam Kumar Reddy : కృష్ణా జలాలతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం ఏ.పి ప్రభుత్వం చెపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా…
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…