Russia: రష్యా దేశ తూర్పు ప్రాంతమైన కురిల్ దీవుల్లో ఆదివారం 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి సంబంధించి మొదటగా సునామీ హెచ్చరిక జారీ చేసిన రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ, అనంతరం అలల పొడవు తక్కువగా ఉందని పేర్కొంటూ హెచ్చరికను ఉపసంహరించుకుంది. భూకంప ప్రభావంతో తీర ప్రాంతాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ భూకంపం తర్వాత పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా ఎటువంటి సునామీ ముప్పు లేదని…